Ravi Shastri: టీమిండియాకి గుడ్ బై.. ఐపీఎల్ లో కోచ్ గా రవిశాస్త్రి..!?

* నేటితో ముగియనున్న రవిశాస్త్రి కోచ్ పదవీకాలం

Sandeep Reddy
Published on: 8 Nov 2021 1:54 PM IST
Ravi Shastri Likely to Join With Ahmedabad Team Coach For IPL 2022
X

Ravi Shastri: టీమిండియాకి గుడ్ బై.. ఐపీఎల్ లో కోచ్ గా రవిశాస్త్రి..!?

Ravi Shastri: గత నాలుగేళ్ళుగా టీమిండియా కోచ్ గా బాధ్యతలు నిర్వహించిన రవిశాస్త్రి పదవీకాలం నేటితో ముగియనుంది. రవిశాస్త్రి తరువాత టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా రవిశాస్త్రి తన కోచ్ పదవిలో కొనసాగాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి భారత క్రికెట్ జట్టుకు కాకుండా ఇటీవలే ఐపీఎల్ లో చేరిన అహ్మదాబాద్ జట్టుకు కోచ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం.

అహ్మదాబాద్ జట్టు యాజమాన్యం ఇప్పటికే రవిశాస్త్రిని సంప్రదించినట్లుగా తెలుస్తుంది. కొత్త జట్టు కావడంతో పాటు త్వరలో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలంలో రవిశాస్త్రి వంటి సీనియర్ ఉంటే ఏ ఆటగాళ్ళను వేలంలో తీసుకోవాలో కూడా సులభం అవుతుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే టీమిండియా కోచ్ గా తన బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించిన రవిశాస్త్రి.. మరి ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి అహ్మదాబాద్ జట్టుకు కోచ్ ఏ మేరకు విజయాలను అందిస్తాడో వేచిచూడాల్సిందే..!!

ఇక టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా నేడు నమీబియా జట్టుతో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ అవకాశాన్ని కోల్పోయిన టీమిండియా సోమవారం నామమాత్రపు మ్యాచ్ జరగనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story