The Hundred: ద హండ్రెడ్ లీగ్‌లో రషీద్ ఖాన్ అరాచకం.. 5 బంతుల్లోనే 3 వికెట్లు

Rashid Khan, Sam Curran star with 3 wickets each in The Hundred
x

The Hundred: ద హండ్రెడ్ లీగ్‌లో రషీద్ ఖాన్ అరాచకం.. 5 బంతుల్లోనే 3 వికెట్లు

Highlights

The Hundred: ద హండ్రెడ్ లీగ్‌లో రషీద్ ఖాన్ అరాచకం.. 5 బంతుల్లోనే 3 వికెట్లు

The Hundred: ది హండ్రెడ్ లీగ్ 2025లో అఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ సంచలన ప్రదర్శన కనబరిచారు. వీళ్లిద్దరూ కలిసి సదరన్ బ్రేవ్ జట్టును కుప్పకూల్చేశారు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడిన ఈ ఇద్దరూ మూడు వికెట్లు చొప్పున తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. బౌలింగ్‌లో అదరగొట్టిన సామ్ కరన్, బ్యాటింగ్‌లో కూడా రాణించి తన జట్టుకు విజయాన్ని అందించాడు. సదరన్ బ్రేవ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేవలం ఐదు బంతుల్లో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ మూడు వికెట్లు కూడా కీలకమైన ఆటగాళ్లవి. జేసన్ రాయ్, జేమ్స్ కోల్స్, మైకేల్ బ్రేస్‌వెల్ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను రషీద్ అవుట్ చేశాడు. అతను వేసిన ఏడో సెట్‌లో తొలి రెండు బంతులకు జేసన్ రాయ్, బ్రేస్‌వెల్‌లను అవుట్ చేసి, ఆ సెట్‌లోని చివరి బంతికి జేమ్స్ కోల్స్‌ను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ తన 20 బంతులలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో 10 బంతులు డాట్ బాల్స్ కావడం విశేషం.

రషీద్ ఖాన్‌తో పాటుగా మరో స్టార్ ఆల్ రౌండర్ సామ్ కరన్ కూడా ఈ మ్యాచ్‌లో మెరిశాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి, సదరన్ బ్రేవ్స్‌ను 133 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సామ్ కరన్ 18 బంతులు వేసి 21 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టుకు సామ్ కరన్ బ్యాట్‌తో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 32 బంతుల్లోనే 50 పరుగులు చేసి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. సామ్ కరన్ అజేయంగా నిలిచి, జట్టుకు 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. ఈ ఆల్ రౌండర్ ప్రదర్శనతో సామ్ కరన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories