IPL 2021: ఆర్ఆర్ బౌలర్ చేతన్ ఇంట విషాదం

IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మెరిసిన యువ పేసర్ చేతన్ సకారియా. ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది.

Venkata Chari
Updated on: 9 May 2021 6:45 PM IST
Rajasthan Royals Pacer Chetan Sakariyas Father Passes Away Due To Covid-19
X

చేతన్ సకారియా (ఫొటో ట్విట్టర్)

IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మెరిసిన యువ పేసర్ చేతన్ సకారియా. ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది. ఈ పేసర్ తండ్రి కంజిభాయ్.. ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు గుజరాత్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్ను మూశారు.

చేతన్ సకారియా తండ్రి కంజిభాయ్ టెంపో డ్రైవర్. అతని సంపాదనతోనే ఇళ్లు గడిచేది. అయితే.. ఐపీఎల్ 2021 సీజన్‌ మినీ వేలంలో చేతన్ సకారియాని రూ.1.2 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దీంతో వీరి కష్టాలు కొద్దిగా తీరాయనుకున్నారు. కానీ, ఈ లోపు తన తండ్రి కరోనా బారిన పడ్డాడు. దీంతో వచ్చిన డబ్బుని ట్రీట్‌మెంట్‌కి వాడుతున్నారు. అయినా కానీ ఫలితం లేకుండా పోయింది.

ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. దీంతో ఇంటికి వెళ్లిన చేతన్ సకారియా వెంటనే ఆసుపత్రికి వెళ్లి తన తండ్రిని చూశాడు. ఈ క్రమంలో కోలుకుంటున్నట్లు కనిపించినా.. రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం సకారియాకి తీరని లోటు.

Venkata Chari

Venkata Chari

Next Story