RR VS LSG: రాజస్థాన్ రాయల్స్ బోణీ.. 20 పరుగుల తేడాతో లక్నోపై విజయం

RR VS LSG: 52 బంతుల్లో 82 పరుగులు చేసిన సంజు శాంసన్

Jyothi
Published on: 25 March 2024 7:36 AM IST
Rajasthan Royals Beat Lucknow Super Giants By 20 Runs
X

RR VS LSG: రాజస్థాన్ రాయల్స్ బోణీ.. 20 పరుగుల తేడాతో లక్నోపై విజయం

RR VS LSG: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. 20 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. 52 బంతుల్లో ఆరు సిక్సర్లతో సంజు శాంసన్ విశ్వరూపం చూపాడు. సంజూ శాంసన్ 82 పరుగులు చేయగా.. రియాన్ పరాగ్ 43 పరుగులతో రాణించాడు.

ఇక 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 రన్స్ మాత్రమే చేయగలిగింది. పూరన్ 64, కేఎల్ రాహుల్ 58 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. 11 పరుగులకే టాప్‌ ఆర్డర్ వికెట్లు కూలడంతో లక్నో కష్టాల్లో పడింది. వరుస వికెట్లతో ఆ తర్వాత వచ్చిన రాహుల్‌ వేగంగా ఆడలేకపోయాడు. పూరన్ చివర్లో బ్యాట్ ఝుళిపించినా ఆఖర్లో ధాటిగా ఆడలేకపోవడంతో లక్నో ఓటమి పాలైంది.

Jyothi

Jyothi

Next Story