KKR vs RR: ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

KKR vs RR: రెండు వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్

Jyothi
Published on: 17 April 2024 7:22 AM IST
Rajasthan Royals Beat Kolkata Knight Riders By 2 Wickets
X

KKR vs RR: ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

KKR vs RR: ఐపీఎల్ 17 సీజన్ ఉత్కంఠ పోరులో మరో థ్రిల్లర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. రాజస్థాన్ రాయల్స్ విజయభేరీ మోగించింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి చేధించింది. ఈ మాచ్ లో ఓపెనర్ బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. మెగా టోర్నీలో రెండో సెంచరీతో మ్యాచ్ విజయానికి కృషి చేశాడు. ఆరంబంలో రాజస్థాన్ రాయల్స్ తడబడినా వరుస క్రమంలో జైశ్వాల్, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి టీం కస్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పరాగ్ తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు.

ఆ తర్వాత పరాగ్, అశ్విన్, హెట్ మైర్ ఔటు అయ్యారు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయమైందని అంతా బావించారు. అయినా క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం పట్టు విడవలేదు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ తన జోరు కొనసాగించాడు. ఆఫ్ సెంచరీ పూర్తయ్యాకా బట్లర్ కోలకతా బౌలర్లను ఆటకట్టించాడు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఓవర్ ఆల్ గా 60 బంతుల్లో 9 ఫోర్లు, ఆరు సిక్స్ లతో 107 పరుగులు చేశాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన లిస్టు లో తొలి స్థానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో బట్లర్ నిలిచాడు.

Jyothi

Jyothi

Next Story