IPL 2023: రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం

* ఆఖరి ఓవర్లో ఆఖరి బంతిదాకా సస్పెన్స్

Dhatripriya
Published on: 17 April 2023 7:37 AM IST
Rajasthan Royals Beat Gujarat Titans By Three Wickets
X

IPL 2023: రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం

IPL 2023: ఐపీఎల్ మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అహ‌్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కిక్కెక్కించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, మ్యాచ్ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 విక్కెట్లను కోల్పోయి177 పరుగులు చేసింది. 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. తొలిమూడు ఓవర్లకు రెండు కీలకమైన విక్కెట్లను పోగొట్టుకుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

దేవదత్ పడికల్, కెప్టన్ సంజూశాంసన్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దేవదత్ పడికల్, ఆతర్వాత రియాన్ పరాగ్ ఔటయ్యాక సంజూశాంసన్‌కు జోడీగా సిమ్రాన్ హెట్మియర్ తోడై.. జట్టును విజయతీరం చేర్చారు. సంజూశాంసన్ 32 బంతుల్లో మూడు బౌండరీలు, ఆరు సిక్సర్ల బాది బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిమ్రాన్ హెట్మియర్ 26 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. 12 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లను కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ 66 పరుగులతో నిలించింది. సంజూశామ్సన్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట స్వరరూపమే మారిపింది. 13 ఓవర్లో వరుసగా 3 సిక్సర్లతో విరుచుపడటం ప్రారంభించారు.

ఇటు శాంసస్, అటు సిమ్రాన్ హెట్మియర్ అద్భుతంగా ఆడారు. ఐపీఎల్ 16 వ సీజన్లో లక్ష్యసాధనలో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. క్రికెట్ అభిమానుల్ని ఫిదా చేసింది. తక్కువ బంతుల్లో అత్యథిక పరుగులు సాధించిన సిమ్రాన్ హెట్మియర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చి అభినందించారు.

Dhatripriya

Dhatripriya

Next Story