Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు

Rahul Dravid has Applied for the Post of Team India Head Coach
x

టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు(ఫైల్ ఫోటో)

Highlights

* చీఫ్‌కోచ్‌గా ద్రవిడ్‌ నియామకం ఇదివరకే ఖరారు

Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. దీంతో అతడి ఎంపిక ఇక లాంఛనమే కానుంది. దరఖాస్తులకు మంగళవారం చివరిరోజు కావడంతో ద్రవిడ్‌ ఈ ప్రక్రియను ముగించాడు. ప్రస్తుతం ద్రవిడ్ జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు.

అయితే చీఫ్‌కోచ్‌గా ద్రవిడ్‌ నియామకం ఇదివరకే ఖరారైందని, ఇది కేవలం లాంఛనమేనని బోర్డు సీనియర్‌ అధికారి తెలిపాడు. ఇక ఎన్‌సీఏ నుంచి ద్రవిడ్‌ వైదొలిగితే ఆ స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమించాలనుకుంటున్నారు. అయితే ఇదివరకే అతడీ ఆఫర్‌ను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ పదవి స్వీకరిస్తే లక్ష్మణ్‌ సన్‌రైజర్స్‌ మెంటార్‌, కామెంట్రీ, కాలమ్స్‌కు దూరం కావాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories