క్రీడాభిమానులకు షాకిచ్చిన పీవీ సింధు!

ప్రముఖ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు అభిమానులకు షాకిచ్చారు.. ఐ రిటైర్ అంటూ ట్వీట్ చేయడంతో అభిమానులంతా కంగారు పడ్డారు. ఆమె బ్యాడ్మింటన్ కు గుడ్ బై చెప్పినట్లు భావించారు.

admin
Updated on: 3 Nov 2020 9:02 AM IST
క్రీడాభిమానులకు షాకిచ్చిన పీవీ సింధు!
X

ప్రముఖ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు అభిమానులకు షాకిచ్చారు.. ఐ రిటైర్ అంటూ ట్వీట్ చేయడంతో అభిమానులంతా కంగారు పడ్డారు. ఆమె బ్యాడ్మింటన్ కు గుడ్ బై చెప్పినట్లు భావించారు. కానీ కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిణామాలు, మారిపోయిన అందరి జీవితాలు వైరస్ నుంచి విముక్తి కోరుకుంటున్నాయని సింధు సుదీర్ఘ వివరణలో పేర్కోన్నారు.. కరోనా వల్ల ఏర్పడిన పరిణామాల కారణంగా తాను డెన్మార్క్ ఓపెన్లో ఆడలేకపోయినట్లు, త్వరలోనే ఆసియా ఓపెన్ కోసం సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సింధు సెటైర్ ను అభిమానులు అర్ధం చేసుకోవడంలో పొరపడ్డారు.

admin

admin

Next Story