సీరియస్ అయిన సింధు...

సీరియస్ అయిన సింధు...
x
Highlights

ఒలింపిక్స్‌ నేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చి తానులండన్‌ వెళ్లినట్లు వచ్చిన వార్తలను పీవీ సింధు ఖండించింది. సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసిన...

ఒలింపిక్స్‌ నేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చి తానులండన్‌ వెళ్లినట్లు వచ్చిన వార్తలను పీవీ సింధు ఖండించింది. సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసిన సింధు ఆ వార్తలు ప్రచురించిన రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాను న్యూట్రిషియన్‌, రికవరీ అవసరాల కోసం లండన్‌ వెళ్లినట్లు వివరించింది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికే కొద్దిరోజుల క్రితం లండన్‌కు వచ్చానని కుటుంబ సభ్యుల అనుమతితోనే ఇక్కడి జీఎస్‌ఎస్‌ఐలో చేరానని చెప్పుకొచ్చింది.

మొట్టమొదటిసారి తల్లిదండ్రులు లేకుండా సింధు లండన్ వెళ్లిందంటూ ఓ జాతీయా మీడియాలో కథనం రాసింది. కుటుంబ కారణాలతోనే ఇలా చేసిందన్న ఆ కథనంపై సింధు సీరియస్ అయింది. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నట్లుగా ఓ మాట గట్టిగానే అనేసింది సింధు.

Show Full Article
Print Article
Next Story
More Stories