CSK vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

Punjab Kings won the Toss Elected to Bowl First in CSK vs PBKS in IPL 2021
x

CSK vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్(ట్విట్టర్ ఫోటో)

Highlights

* చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

CSK vs PBKS: ఐపీఎల్ 2021 లో భాగంగా దుబాయ్ క్రికెట్ స్టేడియంలో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. తాజాగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ రాహుల్ బౌలింగ్ ఎంచున్నాడు. ప్లేఆఫ్ చేరే అవకాశం చేజార్చుకున్న పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలుపుతో ఐపీఎల్ 2021 ని ముగించాలని పట్టుదలతో ఉంది.

ఇక టాప్ 2 లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించి టేబుల్ లో టాప్ లో నిలవాలని బరిలోకి దిగనుంది. ఈ రోజు మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ బ్రేవో కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని చెన్నై జట్టు ఆసక్తితో ఎదురుచూస్తుంది.

ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

Show Full Article
Print Article
Next Story
More Stories