MI vs PBKS: ముంబయి ఇండియన్స్‌కు షాకిచ్చిన పంజాబ్ కింగ్స్‌..

MI vs PBKS: 13 పరుగుల తేడాతో ముంబైపై గెలుపు

Jyothi
Published on: 23 April 2023 7:15 AM IST
Punjab Kings won by 13 runs against Mumbai Indians
X

MI vs PBKS: ముంబయి ఇండియన్స్‌కు షాకిచ్చిన పంజాబ్ కింగ్స్‌..

MI vs PBKS: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది నాలుగో విజయంపై కన్నేసిన ముంబై ఇండియన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాక్‌ ఇచ్చింది. పంజాబ్‌ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 57, కామెరూన్‌ గ్రీన్ 67, రోహిత్‌ శర్మ 44 పరుగులతో మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు తీయగా.. నాథన్‌ ఎల్లిస్‌, లివింగ్ స్టోన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సామ్ కరన్ 55, హర్‌ప్రీత్‌ సింగ్ 41 పరుగులతో దూకుడుగా ఆడారు. చివర్లో జితేశ్‌ శర్మ 7 బంతుల్లో 4 సిక్స్‌లతో 25 పరుగుల చేశాడు. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు 96 పరుగులు రాబట్టారు. ముంబై బౌలర్లలో కామెరూన్ గ్రీన్‌, పీయూష్‌ చావ్లా రెండేసి వికెట్లు పడగొట్టగా.. అర్జున్ టెండుల్కర్, బెరెన్‌డార్ప్‌, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ తీశారు.

Jyothi

Jyothi

Next Story