CSK VS PBKS: చెన్నైపై పంజాబ్‌ కింగ్స్‌ విజయం

CSK VS PBKS: 7వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్

Shashank Gullapelli
Published on: 2 May 2024 9:00 AM IST
Punjab Kings Win Over Chennai
X

CSK VS PBKS: చెన్నైపై పంజాబ్‌ కింగ్స్‌ విజయం

CSK VS PBKS: గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను పదిలం చేసుకోవాలనుకున్న చెన్నై ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు చల్లింది. కీలక సమయంలో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట సూపర్ కింగ్స్ 162 పరుగులు చేయగా.. పంజాబ్ బ్యాటర్లు 17.5 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించారు. ఈ సీజన్‌లో సొంతగడ్డపై చెన్నైకిది తొలి ఓటమి కావడం విశేషం. ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడు 62 పరుగులు చేయగా.. ఇతర బ్యాటర్లంతా కలిపి 100 పరుగులు చేశారు. కింగ్స్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. రబడ, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story