PBKS vs DC: బోణీ కొట్టిన పంజాబ్.. ఓటమి పాలైన ఢిల్లీ కాపిటల్స్

PBKS vs DC: 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన ఢిల్లీ

Jyothi
Published on: 24 March 2024 8:35 AM IST
Punjab Kings win by 4 Wickets
X

PBKS vs DC: బోణీ కొట్టిన పంజాబ్.. ఓటమి పాలైన ఢిల్లీ కాపిటల్స్

PBKS vs DC: ఐపీఎల్ -2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. చంఢీఘర్ వేదికగా ఢిల్లీ క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్... కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

పంజాబ్ బ్యాటర్లలో సామ్ కుర్రాన్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా... లివింగ్ స్టోన్ 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా... ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Jyothi

Jyothi

Next Story