MI vs PBKS Highlights: ఐపీఎల్ ఐదో మ్యాచ్‌లో ఓడిన ముంబై

MI vs PBKS Highlights: 12 పరుగుల తేడాతో గెలిచిన పంజాబ్

Rama Rao
Published on: 14 April 2022 6:34 AM IST
Punjab Kings beat Mumbai Indians by 12 runs
X

ఐపీఎల్ ఐదో మ్యాచ్‌లో ఓడిన ముంబై

MI vs PBKS Highlights: ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్‌ ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంబాబ్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఎదుట పెట్టింది. లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే ఆలౌట‌ అయ్యింది.

ముంబై బ్యాట్సమన్ లో డివాల్డ్ బ్రీవీస్49, సూర్యకుమార్ యాదవ్43, తిలక్ వర్మ36 స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా బ్రీవీస్ 4 ఫోర్లు, 5 సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్43 కీలక సమయంలో పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లు కీలకమైన సమయంలో ముంబై బ్యాటర్లు కట్టడి చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కఠంగా మారింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంబాబ్‌కు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. నిలకడగా ఆడుతూ సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగారు.

Rama Rao

Rama Rao

Next Story