దబాంగ్ ఢిల్లీని వణికించిన పట్నా పైరేట్స్‌

దబాంగ్ ఢిల్లీని వణికించిన పట్నా పైరేట్స్‌
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో ప్లేఆఫ్ బెర్తును సునాయసంగా ఖాయం చేసుకున్న దబాంగ్ ఢిల్లీ జట్టును పట్నా పైరేట్స్‌ వణికించింది. గురువారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చివర్లో పుంజుకున్న దబాంగ్ ఢిల్లీ ఎట్టకేలకు 43-39 తేడాతో పట్నాపై గెలిచి ఊపిరి పీల్చుకుంది.

ప్లేఆఫ్ బెర్తు సొంతం కావడంతో ఈ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ యువ ఆటగాళ్లకి అవకాశమిచ్చింది. రైడర్ విజయ్ 12 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. డిఫెండర్ అనిల్ కుమార్ 4 పాయింట్లతో రాణించాడు.ఈ మ్యాచ్‎లో స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. మ్యాచ్ చివరి వరకూ పట్నాదే పైచేయిలా కనిపించింది. మ్యాచ్‌లో ‎ పర్దీప్ ఏకంగా 19 పాయింట్లను సాధించాడు. పర్దీప్ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. కానీ జట్టు మిగతా సభ్యులను అతని సంపూర్ణ సహాకారం లభించలేదు. ఆఖర్లో డిఫెన్స్ చేసిన తప్పిదాలతో దబాంగ్ ఢిల్లీ పుంజుకుంది దీంతో ఉఠ్కంట భరితంగా సాగిన మ్యాచ్ ఏకపక్షంగా మారింది. ప్లేఆఫ్ రేసుని సంక్లిష్టంగా మార్చుకున్న పట్నా పైరేట్స్ దబాంగ్ ఢిల్లీపై ఓటమితో మరింత వెనకబడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories