ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం.. పలువురు క్రీడాకారులకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ముర్ము

* తెలుగు రాష్ట్రాలకు చెందిన నిఖత్ జరీన్, ప్రణయ్.. ఆకుల శ్రీజలకు అర్జున అవార్డులు

R Tripura Malini
Published on: 30 Nov 2022 5:57 PM IST
President Murmu presented awards to many sportspersons
X

ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం.. పలువురు క్రీడాకారులకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ముర్ము

National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలువురు క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ అందుకున్నాడు. 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకున్నారు. మరో 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు. అర్జున అవార్డు అందుకున్నవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, బ్యాడ్మింట్‌న్‌ స్టార్‌ H.ప్రణయ్‌, ఆకుల శ్రీజ ఉన్నారు. 2022కు సంబంధించిన ఈ క్రీడా అవార్డులను నవంబర్ 14న భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story