PM Modi: భారత ప్లేయర్లను ఓదార్చిన ప్రధాని మోడీ

PM Modi: ఈరోజు, ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాం

Jyothi
Published on: 21 Nov 2023 10:30 AM IST
PM Narendra Modi Consoles India Team in Dressing Room after World Cup Final Loss Against Australia
X

PM Modi: భారత ప్లేయర్లను ఓదార్చిన ప్రధాని మోడీ 

PM Modi: ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమితో తీవ్ర విచారంలో మునిగిపోయిన భారత ఆటగాళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఓటమి అనంతరం కొందరు భారత క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్లేయర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిన ప్రధాని.. పేసర్‌ షమిని కౌగిలించుకుని ఓదార్చారు. దీనికి సంబంధించి మోదీ భారత జట్టును ఉద్దేశించి ట్విట్టర్ లో ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, పట్టుదల గుర్తుంచుకోదగ్గవి. మీరు గొప్ప ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశారు. ఈ రోజు, ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాం’’ అని మోడీ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

Jyothi

Jyothi

Next Story