PM Modi tribute to Major Dhyan Chand: ధ్యాన్‌చంద్‌కు ప్ర‌ధాని నివాళి

PM Modi tribute to Major Dhyan Chand| జాతీయ క్రీడా దినోత్సవం సంద‌ర్భంగా ప్రధాని న‌రేంద్ర‌మోదీ క్రీడాకారులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క్రీడాకారుడు, హాకీ లెజెండ్ మేజ‌ర్ ధ్యాన్‌చంద్‌కు ఆయ‌న నివాళుల‌ర్పించారు.

Karampoori Rajesh
Published on: 29 Aug 2020 1:21 PM IST
PM Modi tribute to Major Dhyan Chand: ధ్యాన్‌చంద్‌కు ప్ర‌ధాని నివాళి
X

 PM Modi pays tribute to Major Dhyan Chand on National Sports Day

PM Modi tribute to Major Dhyan Chand| జాతీయ క్రీడా దినోత్సవం సంద‌ర్భంగా ప్రధాని న‌రేంద్ర‌మోదీ క్రీడాకారులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క్రీడాకారుడు, హాకీ లెజెండ్ మేజ‌ర్ ధ్యాన్‌చంద్ 110 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. భార‌తీయ హాకీ జ‌ట్టుకు గుర్తింపు రావ‌డానికి ఆయ‌న చేసిన సేవ‌లు అమోఘమ‌ని కొనియాడారు.

హాకీ స్టిక్‌తో ధ్యాన్‌చంద్ చేసిన మ్యాజిక్‌ను దేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోద‌ని ప్ర‌ధాని ట్విట్ట‌ర్ చేశారు . క్రీడాకారుల విజ‌యం కోసం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్న వారి కుటుంబ‌స‌భ్యులు, కోచ్‌లు, తోటి ఆట‌గాళ్ల‌ను స‌తర్క‌రించుకునే రోజు అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

'జాతీయ క్రీడాదినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఈ రోజు ధ్యాన్‌చంద్‌కు ఘ‌న నివాళులు అర్పిస్తున్నాం. హాకీ స్టిక్‌తో ధ్యాన్‌చంద్ చేసిన మ్యాజిక్‌ను భార‌త్ ఎప్పటికీ మ‌రిచిపోదు. జాతీయ క్రీడాదినోత్స‌వం జ‌రుపుకుంటున్న ఈ రోజు.. ప్ర‌తిభ‌గ‌ల క్రీడాకారుల విజ‌యం కోసం శ్రమిస్తున్న వారి కుటుంబ‌స‌భ్యులు, కోచ్‌లు, స‌హ క్రీడాకారుల‌ను అభినందించాల్సిన రోజు' అని ప్ర‌ధాని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.


Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story