PM Modi: పారిస్ ఒలింపిక్స్‌కి వెళ్లే అథ్లెట్లతో ప్రధాని మోడీ భేటీ

PM Modi: ఒలింపిక్స్‌ 2036 పోటీలకు ఆతిథ్య ఇచ్చేందుకు భారత్ బిడ్డింగ్‌ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

Arun Chilukuri
Published on: 5 July 2024 4:29 PM IST
PM Modi asks athletes to share observations on conduct of Olympics
X

PM Modi: పారిస్ ఒలింపిక్స్‌కి వెళ్లే అథ్లెట్లతో ప్రధాని మోడీ భేటీ

PM Modi: ఒలింపిక్స్‌ 2036 పోటీలకు ఆతిథ్య ఇచ్చేందుకు భారత్ బిడ్డింగ్‌ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మరికొద్ది రోజుల్లో పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌ 2024 కోసం ఎంపికైన అథ్లెట్లతో ప్రధాని గురువారం భేటీ అయ్యారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. అథ్లెట్లతో మోదీ భేటీకి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. పోటీనీ ఆస్వాదించాలి కానీ ఒత్తిడికి గురికావద్దన్నారు. మెడల్ కోసం 100 శాతం ప్రయత్నం చేయాలని సూచించారు ప్రధాని మోడీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story