Parthiv Patel Playing XI: పాకిస్తాన్ తో మ్యాచ్ కు టీమిండియా తుదిజట్టు

* భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కి పార్థివ్ పటేల్ ఎంపిక చేసుకున్న భారత తుది జట్టు

Sandeep Reddy
Published on: 21 Oct 2021 2:56 PM IST
Parthiv Patel Announced his Team India Playing XI Against India vs Pakistan in T20 World Cup 2021
X

Parthiv Patel Playing XI: పాక్ తో జరగబోయే మ్యాచ్ లో టీమిండియా తుదిజట్టు

Parthiv Patel Playing XI: అక్టోబర్ 24న జరగబోయే టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా దాయాదుల మధ్య పోరుకు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం జరగనున్న మ్యాచ్ లో ఎవరు తన తుది జట్టులో ఉండనున్నారో భారత మాజీ వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్ ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ధివ్ ప్లేయింగ్ ఎలెవెన్ ని ప్రకటించాడు.

పాక్ తో జరిగే మ్యాచ్ లో భారత జట్టు తరపున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగగా, విరాట్ కోహ్లి మూడవ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ నాలుగవ స్థానంలో, రిషబ్ పంత్ అయిదు స్థానంలో బ్యాటింగ్ కి దిగగా హార్దిక్ పాండ్యని ఫినిషర్ గా ఆరు స్థానంలో ఆడించాలన్నాడు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాతో పాటు రాహుల్ చహార్ ని ఎంపిక చేసుకున్న పార్ధివ్ పటేల్.. శార్దుల్ టాగూర్, భువనేశ్వర్ కుమార్ లలో ఎవరో ఒకరిని మాత్రమే ఆడించాలన్నాడు. పేస్ బౌలింగ్ లో జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీలను ఎంపిక చేసుకున్నాడు పార్ధివ్ పటేల్.

పాకిస్తాన్ తో మ్యాచ్ కు పార్ధివ్ పటేల్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టు ఇదే..

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చహార్, శార్దుల్ టాగూర్/భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ

Sandeep Reddy

Sandeep Reddy

Next Story