WTC 2025: బంగ్లా దెబ్బకు పాక్ జట్టుకు ఊహించని షాక్.. ఆ లిస్టులో మరింత దిగజారిన ప్లేస్..!

ICC Rankings: పాకిస్థాన్‌ క్రికెట్ (Pakistan Cricket Team) జట్టుకు బంగ్లాదేశ్ జట్టు బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2024 12:48 PM IST
Pakistan Test Rankings Drop and 8th Palce in WTC 2025 Points Table after Bangladesh Series Loss
X

WTC 2025: బంగ్లా దెబ్బకు పాక్ జట్టుకు ఊహించని షాక్.. ఆ లిస్టులో మరింత దిగజారిన ప్లేస్..!

ICC Rankings: పాకిస్థాన్‌ క్రికెట్ (Pakistan Cricket Team) జట్టుకు బంగ్లాదేశ్ జట్టు బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల్ సిరీస్‌లో ఊహించని షాక్ తగలడంతో దిమ్మ తిరిగిన పాక్ జట్టుకు.. మరో ఊహించని షాక్‌ తగిలింది. టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాక్ జట్టు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలోనూ మరింత దిగజారింది. రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది.

డబ్ల్యూటీసీలో ప్రస్తుతం పాకిస్థాన్‌ 76 పాయింట్లతో నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా జట్టు 124 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, భారత జట్టు 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ 108 పాయింట్లతో టాప్‌-3లో నిలిచాయి.

టాప్ 4కి చేరిన బంగ్లాదేశ్..

కాగా, తాజాగా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ వేదికగా జరగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ ఫైనల్లో టాప్ 2 జట్లు టైటిల్ కోసం పోటీ పడతాయి. ఈ పాయింట్ల పట్టిక ప్రకారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండు స్థానలో నిలిచాయి.

ఫైనల్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరగనుందని భావిస్తున్నారు. రాబోయే మూడు నెలలు టాప్ 4 టీంలకు చాలా కీలకం కానుంది. కాగా, పాకిస్తాన్ జట్టును క్లీన్‌స్వీప్‌ చేసి టెస్ట్ సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్‌ 45.83 పాయింట్ల శాతంతో 4వ స్థానానికి చేరుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story