గూఢచారి చిహ్నంతో క్రికెట్ గ్రౌండ్‌లోకి పాకిస్థాన్? కొత్త జెర్సీపై మొదలైన రచ్చ.. ఐసీసీ ఏం చేయబోతోంది?

గూఢచారి చిహ్నంతో క్రికెట్ గ్రౌండ్‌లోకి పాకిస్థాన్? కొత్త జెర్సీపై మొదలైన రచ్చ.. ఐసీసీ ఏం చేయబోతోంది?
x
Highlights

Pakistan Jersey: ఇప్పటికే భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ మంకుపట్టు పడుతున్న పాకిస్థాన్ జట్టు, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.

Pakistan Jersey: ఇప్పటికే భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ మంకుపట్టు పడుతున్న పాకిస్థాన్ జట్టు, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం విడుదల చేసిన తమ అధికారిక జెర్సీపై పాక్ నిఘా సంస్థ 'ఐఎస్ఐ' (ISI) చిహ్నాన్ని పోలిన 'మార్ఖోర్' (Markhor) బొమ్మను ముద్రించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. క్రీడల్లో రాజకీయ, గూఢచారి చిహ్నాలను ఎలా అనుమతిస్తారంటూ నెటిజన్లు ఐసీసీని ప్రశ్నిస్తున్నారు.

ఏమిటీ మార్ఖోర్ వివాదం?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ కొత్త కిట్‌ను 'వ్యాన్‌గార్డ్ మార్ఖోర్ ఎడిషన్' (Vanguard Markhor Edition) పేరుతో లాంచ్ చేసింది. ఆకుపచ్చ రంగు జెర్సీపై మధ్యలో నల్లటి రంగులో అడవి మేక 'మార్ఖోర్' చిత్రాన్ని గ్రాఫిక్ రూపంలో ప్రింట్ చేశారు.

జాతీయ జంతువు: మార్ఖోర్ అనేది పాకిస్థాన్ జాతీయ జంతువు.

ISI కనెక్షన్: వివాదానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఇదే మార్ఖోర్ చిహ్నాన్ని పాక్ గూఢచారి సంస్థ ISI కూడా తన అధికారిక లోగోగా వాడుతోంది.

నెటిజన్ల ఫైర్: క్రీడా మైదానంలో ఇలాంటి వివాదాస్పద చిహ్నాలను ప్రదర్శించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని, పాక్ కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మార్ఖోర్: ప్రపంచంలోనే అతిపెద్ద అటవీ మేక

మార్ఖోర్ అనేది హిమాలయ మరియు కారకోరం పర్వత ప్రాంతాల్లో కనిపించే ఒక అరుదైన మేక జాతి.

రూపం: ఇది సుమారు 5 అడుగుల వరకు పెరుగుతుంది. దీని కొమ్ములు కార్క్‌స్క్రూ (తిరిగినట్లు) ఆకారంలో ఉండి 5 అడుగుల పొడవు వరకు ఉంటాయి.

నివాసం: ఇవి ప్రధానంగా గిల్గిత్-బాల్టిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కనిపిస్తాయి.

వివాదం: PoK ప్రాంతానికి చెందిన జంతువును జెర్సీపై ముద్రించడం ద్వారా భారత్ సార్వభౌమత్వాన్ని పాక్ ప్రశ్నిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్‌తో మ్యాచ్‌కు నో.. ఐసీసీ సీరియస్!

మరోవైపు, ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం ఒక్క మ్యాచ్‌నే బహిష్కరించడం కుదరదని, సెలెక్టివ్ పార్టిసిపేషన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories