పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ పై మహిళ లైంగిక ఆరోపణలు!

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ పై మహిళ లైంగిక ఆరోపణలు!
x
Highlights

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్‌ అజాం పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. తనని వివాహం చేసుకుంటానని నమ్మించి బాబర్‌ అజాం మోసం చేశాడని ఆమె ఆరోపణలు చేసింది. మీడియా ముందు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్‌ అజాం పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. తనని వివాహం చేసుకుంటానని నమ్మించి బాబర్‌ అజాం మోసం చేశాడని ఆమె ఆరోపణలు చేసింది. మీడియా ముందు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. తానూ బాబర్‌ అజాం కలసి చదువుకున్నామని, ఆ సమయంలో బాబర్ పెళ్ళికి ప్రతిపాదించాడని వెల్లడించింది. ఆ మరుసటి సంవత్సరం తాము ఇంటినుంచి పారిపోయామని వివరించింది.

ఇక బాబర్ క్రికెట్ లో రాణించేందుకు తానూ ఎంతో సహాయం చేశానని, అయితే జాతీయ క్రికెట్ టీంకి ఎంపికైన తరవాత అతని వైఖరిలో చాలా మార్పు వచ్చిందని ఆమె మీడియాకి వెల్లడించింది. ఇక వివాహం చేసుకుంటానని మాట ఇచ్చిన బాబర్ తనను గర్భవతిని చేశాడని, ప్రస్తుతం బెదరింపులకి పాల్పడుతున్నాడని ఆమె మీడియాకి వెల్లడించింది. ఆ బెదిరింపులను తట్టుకోలేకే తానూ పోలీసులను ఆశ్రయించక తప్పలేదని వెల్లడించింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక దీనిపైన బాబర్, పాక్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. అటు బాబర్‌ అజాం ప్రస్తుతం పాక్ జట్టుకి అన్ని ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories