IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ముందే ప్లేయింగ్ 11ను ప్రకటించిన పాకిస్తాన్.. లక్కీ ఛాన్స్ ఎవరి దక్కిందంటే?

Pakistan Announced Playing XI Against India in Asia Cup 2023
x

IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ముందే ప్లేయింగ్ 11ను ప్రకటించిన పాకిస్తాన్.. లక్కీ ఛాన్స్ ఎవరి దక్కిందంటే?

Highlights

Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు తన ప్లేయింగ్ 11ని ప్రకటించింది.

India vs Pakistan: ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. సూపర్-4 దశలో భారత్, పాకిస్థాన్ జట్లు కూడా మరోసారి తలపడనున్నాయి. 2023 ఆసియా కప్‌లో ఇరుజట్ల మధ్య ఇది రెండో పోరు. ఇంతకుముందు, గ్రూప్ దశలో వర్షం కారణంగా భారత్-పాకిస్తాన్ ఫలితం రాలేదు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 10న జరగనుంది.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

ఆసియా కప్ 2023లో సూపర్-4 రెండో మ్యాచ్ కోసం పాకిస్థాన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లకుగాను పాకిస్థాన్ జట్టు తన ప్లేయింగ్ 11ను మ్యాచ్‌కు ఒక రోజు ముందు ప్రకటిస్తోంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సూపర్-4 తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ ఆడించాలని పాకిస్థాన్ నిర్ణయించుకుంది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ ఓడించింది.

మ్యాచ్‌పై వర్షం ముప్పు..

ఈ మ్యాచ్‌పై కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 90 శాతం ఉంది. కొలంబోలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అభిమానుల టెన్షన్ పెరిగింది. ఆసియా కప్ 2023 మూడో మ్యాచ్ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగింది. కానీ, వర్షం కారణంగా ఈ మ్యాచ్ పూర్తి కాలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు అయింది. అయితే, ఈసారి భారత్-పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంచారు.

భారత్‌తో మ్యాచ్ కోసం పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:

ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అగా, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా.

2023 ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు-

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (రిజర్వ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, జస్ప్రీత్ బుమ్రా షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories