Nithiin: ఓటీటీలో విడుద‌ల కానున్న 'చెక్' సినిమా.. డేట్ ఫిక్స్

Nithiin: హీరో నితిన్ నటిచిన చెక్ మూవీ ఓటీటీ లో విడుదల కానుంది

Samba Siva Rao
Updated on: 12 May 2021 3:04 PM IST
Nithiin Check movie Releasing in OTT This Ramzan
X

చెక్ మూవీ పోస్టర్ 

Nithiin: యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'చెక్'. ఈ మూవీలో నితిన్‌లోని కొత్తకోణాన్ని తెరపై చూపించేలా చంద్రశేఖర్‌ యేలేటి సినిమాను తీర్చిద్దారు. గత ఏడాది భీష్మ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు నితిన్. ఆ సినిమా బాక్సాఫీసు ముందు భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో ఈ ఏడి చెక్, రంగ్ దే విడుద చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 26న థియేటర్స్‌లో విడుద‌ల అయినా చెక్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆశించినంత కమర్షియల్ హిట్‌గా నిలవలేకపోయింది. రంజాన్ సందర్బంగా 'చెక్' సినిమామే 14 నుండి స‌న్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. భవ్య క్రియేషన్స్‌ వి ఆనంద్ కుమార్ ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ బాణీలు అందిస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో అనే మూవీ రూపొందుతుంది. అయితే సినిమా బాలీవుడ్ హిట్ అంధాదున్ తెలుగు రీమేక్ ఈ 'మాస్ట్ర. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా, మిల్కీ బ్యూటీ తమన్నా ముఖ్య పాత్ర‌లో కనిపించబోతున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story