Nikhat Zareen: జాతీయ బాక్సింగ్‌ ఛాంప్‌గా నిఖత్‌ జరీన్.. ఫైనల్స్‌లో అనామికపై 4-1 తో విజయం

Nikhat Zareen: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ 2022 వ ఏడాదిని ఘనంగా ముగించింది.

Arun Chilukuri
Published on: 26 Dec 2022 4:04 PM IST
Nikhat Zareen Won National Boxing Championship
X

Nikhat Zareen: జాతీయ బాక్సింగ్‌ ఛాంప్‌గా నిఖత్‌ జరీన్.. ఫైనల్స్‌లో అనామికపై 4-1 తో విజయం

Nikhat Zareen: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ 2022 వ ఏడాదిని ఘనంగా ముగించింది. మరోసారి తానేంటో నిరూపించింది. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న నిఖత్... జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో ముందడుగు వేసి అదరగొట్టింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ వేదికగా జరిగిన ఫైనల్లో అద్భుత విజయం సాధించింది మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ తుదిపోరులో తన ప్రత్యర్థి రైల్వేస్​కు చెందిన అనామికను మట్టి కరిపించింది. ఫలితంగా 4-1 తేడాతో విజయం సాధించి జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నిఖత్ కైవసం చేసుకుంది. నిఖత్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story