WTC Final: న్యూజిలాండే గెలుస్తుంది జోస్యం చెప్పిన సంజయ్ మంజ్రేకర్‌

Sanjay Manjrekar
x

సంజయ్  మంజ్రేకర్ ఫైల్ ఫోటో 

Highlights

WTC Final: సౌతాంఫ్టన్ వేదిక‌గా భార‌త్- కివీస్ మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ పోరు జ‌ర‌గనుంది,

WTC Final: సౌతాంఫ్టన్ వేదిక‌గా భార‌త్- కివీస్ మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ పోరు జ‌ర‌గనుంది, వ‌చ్చే జూన్ నెల 18 నుంచి 22 వ‌ర‌కు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌పై భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవడానికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్‌ల తీరును బట్టి చూస్తే న్యూజిలాండ్‌కు విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

అదే ఈ మ్యాచ్‌ భారత్‌లో జరిగి ఉంటే విరాట్ కోహ్లీ సేన కేవ‌లం 3 రోజుల్లోనే విజయం సాధించేదని అభిప్రాయపడ్డారు. సౌతాంఫ్టన్‌లో ఉన్న పరిస్థితులు న్యూజిలాండ్‌కు కాస్త అనుకూలంగా ఉంటాయని తెలిపారు. భారత ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఆ వాతావరణంలో కాస్త మెరుగ్గా రాణించే అవకాశం ఉందని తెలిపారు. భారత జట్టు బౌలింగ్‌ టీం బలంగా ఉందన్నారు. అయినప్పటికీ అక్కడి పిచ్‌లు కివీస్‌ ప్లేయర్లకే అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఏడాది వ్య‌వ‌ధిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై జరిగిన టెస్టు సీరీస్ ల‌లో భార‌త్ భారీ విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియాను సొంత గ‌డ్డ‌పై ఓడించి భార‌త్ రికార్డు సృష్టించింది. ఆసీస్ తో జ‌రిగిన టెస్టు సిరీస్ లో భారత్ పై 2-1 తేడాతో విజ‌యం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. ఇంగ్లండ్‌లో 3-1 తేడాతో గెలుపొందింది. మ‌రోవైపు న్యూజిలాండ్ వెస్టిండీస్‌పై 2-0 తేడాతో, పాకిస్థాన్‌తోనూ 2-0 తేడాతో విజ‌యాలు సాధించింది.

ఈ నేప‌థ్యంలో సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో -భారత జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూన్‌ 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ జరగనుంది. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా.. అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories