ఆ మ్యాచ్‌లు వార్మప్‌లు కాదు.. రెండు సిరీస్‌లు గెలుస్తాం: నీల్ వాగ్నర్

WTC Final: డబ్యూటీసీ ఫైనల్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని కీవీస్ పేస్ బౌలర్ నీల్ వాగ్నర్ ధీమా వ్యక్తం చేశాడు.

Venkata Chari
Published on: 18 May 2021 11:19 AM IST
WTC Final New Zealand Wont Treat England Tests Warmup Games Says Neil Wagner
X

నీల్ వాగ్నర్ (ఫొటో ట్విట్టర్)

WTC Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని న్యూజిలాండ్ పేస్ బౌలర్ నీల్ వాగ్నర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ చేరుకున్న న్యూజిలాండ్ టీం.. బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడింది.

ఈ మేరకు పేస్ బౌలర్ మాట్లాడుతూ..ఇంగ్లాండ్ మ్యాచ్‌లు కూడా మాకు చాలా ముఖ్యం. డబ్యూటీసీ ఫైనల్‌ కు ముందు జరిగే ఇంగ్లాండ్ సిరీస్‌ను వార్మప్‌ మ్యాచ్‌లుగా పరిగణించలేమని పేర్కొన్నాడు. అలాగే ఇంగ్లాండ్ తోపాటు, ఇండియాతో ఆడే టెస్టులను కూడా గెలవాలని పట్టుదలతో ఉన్నామని అన్నాడు.

ఇండియాతో జరిగే డబ్యూటీసీ ఫైనల్‌కు ముందు కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడనుంది. కాగా, టీమిండియాతో పోలిస్తే న్యూజిలాండ్ టీంకు ఎక్కువ ప్రాక్టీస్ దొరకనుంది. టీం ఇండియా అక్కడి చేరుకున్న తరువాత సరైన ప్రాక్టీస్ దొరకదు. న్యూజిలాండ్ మాత్రం రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది.

మరో వైపు న్యూజిలాండ్‌ టీం ఆటగాళ్లు ఆది, సోమ వారాల్లో రెండు బృందాలుగా ఇంగ్లండ్‌ చేరుకున్నారు. ఐపీఎల్‌ అనంతరం మాల్దీవుల్లో ఆగిపోయిన విలియమ్సన్, జేమీసన్, సాన్‌ట్నర్‌ విడిగా ఇంగ్లండ్‌కు పయనమయ్యారు.

Venkata Chari

Venkata Chari

Next Story