T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అట్టర్‌ఫ్లాప్‌ షో

* టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోను ఓడిన భారత్‌ * టీమిండియాపై న్యూజిలాండ్‌ విజయం * 8 వికెట్ల తేడాతో కివీస్‌ గెలుపు

Shilpa
Published on: 1 Nov 2021 6:43 AM IST
New Zealand Won the Match Against India with 8 Wickets in T 20 World Cup 2021
X

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అట్టర్‌ఫ్లాప్‌ షో(ఫైల్ ఫోటో)

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అట్టర్‌ఫ్లాప్‌ షో కొనసాగుతూనే ఉంది. గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన కోహ్లీసేన న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. దీంతో భారత్‌ సెమీస్‌ ఆశలు దాదాపు గల్లంతైనట్టే.

టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోను ఓడి చెత్త రికార్డును సొంతం చేసుకుంది. టీ 20 వరల్డ్‌కప్‌లో వార్మప్‌ మ్యాచ్‌లలో సత్తా చాటిన కోహ్లీ సేన సూపర్‌ 12కు వచ్చేసరికి పేలవ ప్రదర్శన ఇస్తోంది.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ ఘన విజయాన్ని సాధించింది. 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ 49 పరుగులతో రాణించగా విలియమ్సన్‌ 33 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు.

అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 3, సోథీ 2, సౌథీ, మిల్నేలు చెరో వికెట్‌ తీశారు.

Shilpa

Shilpa

Next Story