Ross Taylor: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెట‌ర్‌

Ross Taylor: న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు.

Arun Chilukuri
Published on: 30 Dec 2021 10:05 AM IST
New Zealand Player Ross Taylor Retirement to international cricket | Sports News
X

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెట‌ర్‌ 

Ross Taylor: న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా టేలర్‌ ప్రకటించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు అనంతరం తప్పుకోనున్నట్లు తెలిపాడు. 17 సంవత్సరాలపాటు మద్దతుగా నిలిచిన అందరికీ టేలర్‌ ధన్యవాదాలు ప్రకటించారు.

నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని టేలర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా 2006లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో టేలర్‌ అరంగటేట్రం చేశాడు. ఇప్పటి వరకు 233 వన్డేల్లో 8576 పరుగులు చేశాడు. అతడి వన్డే కేరిర్‌లో 21 సెంచరీలు సాధించాడు. అతడు 102 టీ20ల్లో 1909 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 110 టెస్టుల్లో 7585 పరుగులు చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story