Neeraj Chopra: సముద్ర గర్భంలో నీరజ్ చోప్రా జావెలిన్ ప్రాక్టీస్

Neeraj Chopra: *వీడియోను స్వయంగా షేర్ చేసిన నీరజ్ చోప్రా *లైకులు, కామెంట్లతో వైరల్ చేస్తున్న అభిమానులు

Shireesha
Published on: 3 Oct 2021 9:24 AM IST
Neeraj Chopra Practicing Javelin Throw Under Sea Video Goes Viral | Telugu Online News Today
X

సముద్ర గర్భంలో నీరజ్ చోప్రా జావెలిన్ ప్రాక్టీస్

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా మళ్లీ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేపట్టాడు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి ఎక్కడికెళ్లినా అడుగడుగునా నీరజనాలు అందుకుంటున్న చోప్రా.. మళ్లీ కెరీర్ పై దృష్టి సారించాడు. క్రికెటర్ల కంటే ఎక్కువ పేరు సంపాదించి అథ్లెటిక్ రంగంలోని వారి సత్తా చాటిన నీరజ్ చోప్రా భారతదేశంలో యూత్ కు ఐకాన్ గా నిలిచాడు. ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా సంచలనం నమోదు చేస్తున్న నీరజ్ చోప్రా.. సరదాగా మాల్దీవుల్లో వెళ్లినా తన శారీరక కసరత్తులు, జావెలిన్ త్రో మానలేదు.

మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ.. సరదాగా నీటి అడుగున ఆక్సిజన్ సిలిండర్ తో వెళ్లిన నీరజ్ చోప్రా.. అక్కడ కూడా తనదైన శైలిలో జావెలిన్ త్రో చేసిన విన్యాసం చేశాడు. నీరజ్ తో పాటు సముద్రం అడుగున అందాలు వీక్షించేందుకు వెళ్లినవారు వీడియో తీయగా... దాన్ని నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు దాన్ని షేర్లు.. లైకులు.. కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టులో నీరజ్ చోప్రా.. భూమి పైనే కాదు.. ఆకాశంలోకి వెళ్లినా.. సముద్ర గర్భంలోకి వెళ్లినా.. ఎప్పుడూ జావెలిన్ త్రో గురించే ఆలోచిస్తుంటానని.. మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టానని ప్రకటించాడు.


Shireesha

Shireesha

Next Story