Neeraj Chopra: బుమ్రా ఇలా చేస్తే బ్యాటర్ల మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. నీరజ్ చోప్రా కీలక సూచన..!

Neeraj Chopra Key Advice Team India Bowler Jasprit Bumrah to Increasing Pace
x

Neeraj Chopra: బుమ్రా ఇలా చేస్తే బ్యాటర్ల మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. నీరజ్ చోప్రా కీలక సూచన..!

Highlights

Neeraj Chopra Golden Advice to Bumrah: ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా తన అభిమాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సలహా ఇచ్చాడు.

Neeraj Chopra Golden Advice to Bumrah: ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా తన అభిమాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సలహా ఇచ్చాడు. నీరజ్ చోప్రాకి 2023 సంవత్సరం చాలా అద్భుతంగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. భారతదేశ చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారులలో ఒకడు అనడంలో సందేహం లేదు. ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు అతను భారత క్రికెట్‌లోని అత్యుత్తమ బౌలర్‌కు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు.

బుమ్రాకు కీలక సలహా..

ఈ క్రమంలో నీరజ్ చోప్రాని మీ ఫేవరెట్ ఫాస్ట్ బౌలర్ ఎవరని అడగగా.. దానికి జస్ప్రీత్ బుమ్రా పేరు తెలిపాడు. నీరజ్ మాట్లాడుతూ, 'నాకు జస్ప్రీత్ బుమ్రా అంటే ఇష్టం. నేను అతని బౌలింగ్ యాక్షన్‌ను ప్రత్యేకంగా ఇష్టపడతాను. కానీ, ఓ జావెలిన్ త్రోయర్‌గా మాట్లాడితే.. బుమ్రా మరింత వేగం పొందాలి. బుమ్రా తన రన్-అప్‌ను పెంచాలి. బౌలర్లు తమ రన్-అప్‌ను కొంచెం వెనక్కి ప్రారంభిస్తే వారి వేగాన్ని ఎలా పెంచుకోవచ్చో మేం తరచుగా చర్చిస్తాం. బుమ్రా స్టైల్‌ అంటే ఇష్టం' అంటూ చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడనున్న బుమ్రా..

ప్రపంచ కప్ తర్వాత, పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో సహా టీమిండియాలోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. బుమ్రా త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. భారత అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా ఒకడు. అతను క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో భారత ఫాస్ట్ బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తాడు. 29 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 30 టెస్టు మ్యాచ్‌లు ఆడి 128 వికెట్లు పడగొట్టాడు. 89 వన్డేల్లో 149 వికెట్లు తీశాడు. అదే సమయంలో, అతను 62 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 74 వికెట్లు తీశాడు.

బిగ్ స్క్రీన్‌పై కనిపించకపోవడంపై మాట్లాడుతూ..

ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో నీరజ్ చోప్రా కూడా సందడి చేశాడు. అయితే, ప్రపంచకప్‌లో పెద్ద స్క్రీన్‌పై మాత్రం నీరజ్ చోప్రాను ఒక్కసారి కూడా చూపించలేదు. దీనిపై ఆయన మాట్లాడుతూ..'నేను ఆడేటప్పుడు వాళ్లు నన్ను చూపించాలనుకుంటారు. అయితే, నేను డైమండ్ లీగ్‌లో పాల్గొన్న సమయంలో.. ఆ మ్యాచ్‌ను సరిగ్గా ప్రసారం చేయలేరు. ఆ విషయం వాస్తవమే. ఆ సమయంలో కేవలం హైలైట్స్ మాత్రమే చూపిస్తారు. మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్లాను. చాలా ఎంజాయ్ చేశాను. భారత్ గెలిచి ఉంటే, నేను ఆనందించేవాడిని. కానీ, నేను స్టాండ్స్‌లో మంచి సమయం గడిపాను. కెమెరా నా వైపు తిరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఈ ఆలోచన నా మనసులోకి కూడా రాలేదు. ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ను చూడటానికి చాలా మంది పెద్ద ప్రముఖులు స్టేడియానికి వచ్చారు. వీరిలో నరేంద్ర మోడీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్ లాంటివారు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories