Tokyo Olympics: స్వర్ణం సాధిస్తే...6 కోట్లు

Naveen Patnaik Announces Cash Awards for Medal Winners in Tokyo Olympics From Odisha
x

Odisha CM  Naveen Patnaik

Highlights

Tokyo Olympics: ఒడిశా రాష్ట్రం నుండి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు ఒడిశా ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్ ప్రకటించారు.

Tokyo Olympics: ఒడిశా రాష్ట్రం నుండి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒడిశాకు చెందిన క్రీడాకారులు ఒలిపిక్స్ లో పతకాలు సాధిస్తే భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలిపారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.6కోట్లు, రజతం సాధిస్తే 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అంతే కాదు ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులందరికీ రూ.15లక్షలు చొప్పున ఇస్తామన్నారు. క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఒలింపిక్స్ కు ఎంపికైన క్రీడాకారులతో ఆయన సమావేశం ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్ కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి కల అన్నారు. ఒడిశా యువతకు మీరు రోల్ మోడల్, మీ కుటుంబాలతో పాటు మా అందరికీ మీరు గర్వకారణం. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఒలింపిక్స్ లో ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి టీకే బెహ్రా పాల్గొని క్రీడాకారులకు అబినందనలు తెలిపారు. తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ కు వెళ్తన్న ద్యుతి చంద్, ప్రమోద్ భగత్, దీప్ గ్రేస్ ఎక్కా నమిత, టొప్పో, వీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్ లకు నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories