IPL 2021: ధోనీ సలహాతోనే ఎక్కువ వికెట్లు తీశాను - నటరాజన్

IPL 2021: ఎంఎస్‌ ధోనీ సలహాలతోనే గత సీజన్ లో ఎక్కువ వికెట్లు తీశానని యువపేసర్‌ నటరాజన్‌ అన్నాడు.

Venkata Chari
Published on: 7 April 2021 5:23 PM IST
Natarajan Reveals that Dhoni Given Useful Tips in IPL 2020-21 to him
X

నటరాజన్ (ఫొటో: ది హన్స్ ఇండియా)

IPL 2021: ఎంఎస్‌ ధోనీ సలహాలతోనే గత సీజన్ లో ఎక్కువ వికెట్లు తీశానని యువపేసర్‌ నటరాజన్‌ అన్నాడు. స్లో బౌన్సర్లు, కట్టర్లు ఎక్కువగా వేయాలని ధోని సూచించాడని చెప్పాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ధోనీ, డివిలియర్స్‌ వంటి దిగ్గజాలను పెవిలియన్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లో మొత్తం 71 యార్కర్లు విసరడం గమనార్హం.

'ధోనిలాంటి వాళ్లతో మాట్లాడటమే గొప్ప విషయం. ఫిట్‌నెస్‌ గురించి ఎక్కువ మాట్లాడేవారు. స్లో బౌన్సర్లు, కట్టర్లు, విలక్షణ బాల్స్ వేయాలని సూచించారు. అవి నాకెంతో ఉపయోగపడ్డాయి' అని నట్టూ అన్నాడు.

'సీఎస్‌కేతో మ్యాచులో నేను వేసిన ఓ బంతిని ధోని 102 మీటర్ల సిక్సర్‌ బాదేశాడు. ఆ తర్వాతి బంతికే వికెట్‌ తీశాను. ఆ మ్యాచ్‌ ముగిశాక ధోనీతో మాట్లాడాను' అని తెలిపాడు. అలాగే బెంగళూరుతో మ్యాచులో ఏబీ డివిలియర్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు నటరాజన్‌.

Venkata Chari

Venkata Chari

Next Story