40 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఇండియాలో ఐఓసీ సమావేశం

40 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఇండియాలో ఐఓసీ సమావేశం
Mumbai: వచ్చే ఏడాది ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 2023 సెషన్ నిర్వహించేందుకు భారత్ హక్కులు దక్కించుకుంది.
Mumbai: వచ్చే ఏడాది ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 2023 సెషన్ నిర్వహించేందుకు భారత్ హక్కులు దక్కించుకుంది. దీంతో 40 ఏళ్ల తర్వాత మనకు ఆ గౌరవం లభించింది. 1983లో చివరిసారి ఢిల్లీలో ఈ IOC సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్ ఆ విశిష్ట సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న 139వ IOC సెషన్‌లో భారత బృందం ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సభ్యులకు ఓ ప్రెజెంటేషన్ ఇచ్చి ఒప్పించింది. ఇందులో 2008 ఒలింపిక్స్ బంగారు పతక విజేత అభినవ్‌బింద్రాతో పాటు IOC సభ్యురాలు నీతా అంబానీ, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరిందర్ బాట్రా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో భారత్‌లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం మన కల అన్నారు నీతా అంబానీ.
కాగా, ఈ విషయం పట్ల ఐఓసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తర్వాత భారత్‌కు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సమావేశం నిర్వహించే అదృష్టం దక్కిందని, దీంతో భారత్‌లోని యువత ఈ ఒలింపిక్స్ విశేషాలను తెలుసుకునేందుకు చక్కటి అవకాశం లభించిందని ఆమె అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మన దేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం మన కల అని ఆమె పేర్కొన్నారు.
Amit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMT
Narendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMTకళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMTPawan Kalyan: ప్రభుత్వ పథకాల్లో చాలా మందికి కోత పెడుతున్నారు
3 July 2022 1:26 PM GMT