IPL 2021 Play Off: రాజస్తాన్ గెలుపుపైనే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు

* గురువారం జరగనున్న రాజస్తాన్ రాయల్స్ - కలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ తో తేలనున్న ముంబై భవితవ్యం

Sandeep Reddy
Updated on: 6 Oct 2021 3:05 PM IST
Mumbai Indians Play off Depends on Rajasthan Royals win Against Kolkata
X

రాజస్తాన్ రాయల్స్ గెలుపుపైనే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు (ఫైల్ ఫోటో)

IPL 2021 Play Off: ఐపీఎల్ 2021 లో భాగంగా మంగళవారం జరిగిన ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ బెర్త్ కోసం కలకత్తా నైట్ రైడర్స్ తో పొటీపడుతుంది. ఇప్పటికే నెట్ రన్ రేట్ తో పోలిస్తే ముంబై ఇండియన్స్ కంటే కలకత్తా జట్టు మెరుగ్గా ఉండటంతో రానున్న మ్యాచ్ లు కీలకంగా మారనున్నాయి. అక్టోబర్ 8 న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరగబోయే మ్యాచ్ లో ముంబై గెలుపొందటమే కాకుండా రాజస్తాన్ రాయల్స్ చేతిలో కలకత్తా నైట్ రైడర్స్ ఓటమి పాలయితే తప్ప ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరే అవకాశాలు లేవని తెలుస్తుంది.

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు ప్లేఆఫ్ చేరడం.. నాలుగో స్థానం కోసం పోటీపడుతున్న కలకత్తా, ముంబైలలో ఎవరు పైచేయి సాధించనున్నారో గురువారం రాజస్తాన్ - కలకత్తా మధ్య జరిగే మ్యాచ్ తో దాదాపుగా తేలనుంది. కలకత్తా భారీ విజయాన్ని సాధించి నెట్ రన్ రేట్ ని మరింత మెరుగుపరుచుకుంటే మాత్రం ప్లేఆఫ్ పై ముంబై పెట్టుకున్న ఆశలు ఆవిరి అయిపోయినట్లే.. డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టు ఐపీఎల్ 2021 ప్రయాణం గురువారం జరగబోయే మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు విజయంపై ఆధారపడి ఉంది. అక్టోబర్ 7 గురువారం రోజున మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్, సాయంత్రం రాజస్తాన్ రాయల్స్ - కలకత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో బెంగుళూరు జట్టు తలపడనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story