MI vs RCB: బెంగళూరుపై ముంబై ఘన విజయం

MI vs RCB: బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

Jyothi
Published on: 12 April 2024 7:42 AM IST
Mumbai Indians beat Royal Challengers Bengaluru by 7 wickets
X

MI vs RCB: బెంగళూరుపై ముంబై ఘన విజయం

MI vs RCB: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని పాండ్యా సేన చిత్తుచిత్తుగా ఓడించింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లను చితక్కొట్టారు. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరికి తోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా రాణించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్లు తేడాతో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పటీదార్ మెరవడం, చివరిలో ఫినిషర్ దినేశ్ కార్తీక్ రాణించడంతో ఆర్సీబీ ఈ భారీ స్కోరును నమోదు చేసింది.

Jyothi

Jyothi

Next Story