Hardik Pandya: క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వద్ద విదేశీ వాచ్‌లు

*బిల్లులు లేకుండా రూ. 5 కోట్ల విలువ చేసే..రెండు వాచీలు తీసుకొచ్చిన పాండ్యా *వాచ్‌లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు

Shilpa
Updated on: 16 Nov 2021 11:02 AM IST
Mumbai Airport Custom Officials Found two Foreign Watches at Team India Cricketer Hardik Pandya
X

క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వద్ద విదేశీ వాచ్‌లు(ఫైల్ ఫోటో)

Hardik Pandya: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య వద్ద ముంబయి ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారులు రెండు విదేశీ వాచ్‌లను గుర్తించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ పూర్తయ్యాక యూఏఈ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు వాటిని కనుగొన్నారు.

ఆయా వాచ్‌లకు సంబంధించిన రశీదులు పాండ్య వద్ద లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. మరోవైపు గతేడాది కూడా హార్దిక్‌ సోదరుడు కృనాల్‌ పాండ్య ఇలాగే దొరికిపోయాడు. దుబాయ్‌ నుంచి ముంబయికి వచ్చినప్పుడు అధికారులు పలు వాచ్‌లతో సహా భారీ మొత్తంలో బంగారం గుర్తించారు.

Shilpa

Shilpa

Next Story