MS Dhoni: ధోనీ నీ న్యూ లుక్ సూపర్

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కొత్తలుక్ లో కనిపించడంతో అభిమానులు ఆనందంలో ముగినిపోయారు.

Kranthi
Published on: 22 Jun 2021 6:52 AM IST
MS Dhoni in New Look Having Vacation With Family
X

MS Dhoni:(Dhoni Instagram) 

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కొత్తలుక్ లో కనిపిండంతో అభిమానులు ఆనందంలో ముగినిపోయారు. ధోనీ, జీవా ఓ కొండపై నిల్చొని తీసుకున్న ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో కొద్ది రోజులుగా రాంచీలోని తన ఫామ్ హౌజ్లో సేదతీరిన ధోనీ ఇపుడు కుటుంబంతో వెకేషన్ కు వెళ్లాడు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్-19 నిబంధనల్లో ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయడంతో కుటుంబంతో సహా ధోనీ సిమ్లాకు వెళ్లాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొద్ది రోజులు భార్యా, బిడ్డలతో విశ్రాంతి తీసుకోనున్నాడు.

ఎప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా వుండే ధోని ఫోటోలు, వీడియోలను జీవా, సాక్షి ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు. మరో వైపు ఈ ఏడాది భారత్ లో నిర్వహించిన ఐపీఎల్ 14వ సీజన్ బయోబుడగలో పలువురు ఆటగాళ్ళు కరోనా వైరస్ బారిన పడటంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 29 మ్యాచ్ లు జరగ్గా ఇంకా 31 మ్యాచ్ లు నిర్వహించాల్సి వుంది. అయితే వాటిని సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో మరో మూడు నెలల్లో ధోనీ మళ్లీ మైదానంలో కనిపించడనున్నాడు.

Kranthi

Kranthi

Next Story