టీమిండియా బౌలర్ సిరాజ్‌ను మరోసారి టార్గెట్‌ చేసిన ఆసీస్‌ ఫ్యాన్స్

Arun Chilukuri
Published on: 15 Jan 2021 4:17 PM IST
Mohammed Siraj Once Again Abused By Australian Fans At The Gabba
X

టీమిండియా బౌలర్‌ సిరాజ్‌‌ను ఆసీస్‌ ఫ్యాన్స్‌ మరోసారి టార్గెట్‌ చేశారు. గబ్బాలో నాల్గవటెస్టు జరుగుతున్న సందర్భంగా కొందరు ఆసీస్ అభిమానులు సిరాజ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేశారు. కొందరు భారత అభిమానులు ఆసీస్ సిరీస్‌ను రద్దు చేసుకోవాలని కోరుతున్నారు. వారం రోజులు గడవక ముందే సిరాజ్‌పై రెండు సార్లు ఆసీస్ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిడ్నీలో జరిగిన మూడవ టెస్టు సందర్భంగా వరుసగా రెండు రోజులు జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తమ అభిమానుల తరపున టీమిండియా ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పింది. ఈ ఉదంతం మరువకముందే మరోసారి జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన ఆసీస్ ఫ్యాన్స్‌ క్రీడాస్పూర్తిని దెబ్బతీశారు. దీంతో భారత అభిమానులు మండిపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story