ICC ODI Rankings: నంబర్‌ వన్‌ బౌలర్‌గా మహ్మద్ సిరాజ్..

ICC ODI Rankings: టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతోంది.

Arun Chilukuri
Published on: 25 Jan 2023 5:19 PM IST
Mohammed Siraj Crowned world No. 1 Bowler in ODIs
X

ICC ODI Rankings: నంబర్‌ వన్‌ బౌలర్‌గా మహ్మద్ సిరాజ్..

ICC ODI Rankings: టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతోంది. దీంతో ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు కొనసాగింది. టీమిండియా ఫేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నాడు. 729 రేటింగ్ పాయింట్లతో సిరాజ్ తొలి స్థానంలో ఉండగా... ఆస్ట్రేలియా ఫేసర్ హేజిల్ వుడ్ 727 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 708 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక బ్యాటింగ్ విభాగంలో టాప్ టెన్ లో ముగ్గురు టీమిండియా బ్యాట్స్‌మెన్లకు చోటు దక్కింది. శుభ్ మన్ గిల్ 6వ స్థానంలో, విరాట్ కోహ్లీ 7వ స్థానంలో, రోహిత్ శర్మ 9వ స్థానంలో నిలిచారు. తాజాగా న్యూజిలాండ్ టీంని క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి చేరుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story