Mithali Raj : మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం..

Mithali Raj: అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మిథాలీరాజ్

Rama Rao
Updated on: 8 Jun 2022 4:30 PM IST
Mithali Raj Announces Retirement From International Cricket | Cricket News
X

Mithali Raj: క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై

Mithali Raj: మహిళా క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా ఆమె పేరిట రికార్డ్ ఉంది. ఇండియా తరఫున మిథాలీ మొత్తం 232 మ్యాచ్‌లు ఆడింది. 50.68 సగటుతో ఆమె 7, 805 రన్స్‌ స్కోర్ చేసింది.

ఇన్నాళ్లూ తన పట్ల ప్రేమను, అభిమానాన్ని చూపిన వారందరికీ ఆమె తన ట్విట్టర్‌లో థ్యాంక్యూ చెప్పారు. మీ అందరి ఆశీస్సులు, మద్ధతుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు మిథాలీ తన ట్వీట్‌లో తెలిపారు. మిథాలీ సుమారు 23 ఏళ్ల పాటు ఇండియా జట్టు తరపున ఆడారు. టీమిండియా మహిళల జట్టు కెప్టెన్‌గా చేశారు. ఇండియాను గెలిపించాలన్న ఉద్దేశంతోనే ప్రతి మ్యాచ్‌లోనూ పట్టుదలతో ఆడినట్లు తన ట్వీట్‌లో మిథాలీ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story