WPL 2024: ఇవాళ బెంగళూరు, ముంబై మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌

WPL 2024: ఢిల్లీతో తలపడనున్న ఎలిమినేటర్‌ మ్యాచ్ విన్నింగ్ టీమ్‌

Jyothi
Published on: 15 March 2024 11:24 AM IST
MI vs RCB WPL 2024 Eliminator Match In Delhi
X

WPL 2024: ఇవాళ బెంగళూరు, ముంబై మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ తుదిదశకు చేరుకుంది. 12 పాయింట్లతో టేబుల్‌ టాప్‌గా నిలిచి నేరుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫైనల్ చేరింది. ఫైనల్‌‌ బెర్త్ కోసం మరో రెండు జట్లు ఇవాళ తలపడనున్నాయి. ఇవాళ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు, ముంబై జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఢిల్లీని ఢీకొట్టనుంది.

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న ముంబై జట్టు మరోసారి ఫైనల్ చేరి రెండోసారి కప్‌ను సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. చివరి లీగ్‌ మ్యాచ్ మినహా.. సీజన్‌లో ముంబై టీమ్‌ ఆరంభం నుంచి అదరగొట్టింది. ఒకవేళ ముంబై ఫైనల్ చేరితే మొదటి సీజన్ ఫైనల్‌ మళ్లీ రిపీట్ కానుంది. గత సీజన్‌లో కూడా ముంబై, ఢిల్లీ ఆఖరిపోరులో తలపడ్డాయి.

ఇక టోర్నీ ప్రారంభం నుంచి తడబడుతూ పుంజుకున్న ఆర్సీబీ.. తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబైని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

Jyothi

Jyothi

Next Story