ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఈ సారి ఆమె లేకుండానే టోర్నీ!

ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..  ఈ సారి  ఆమె లేకుండానే టోర్నీ!
x

Mayanti Langer 

Highlights

Mayanti Langer : ఐపీఎల్ 13 సీజన్ రేపు మొదలు అవుతుంది అన్న క్రమంలో ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఎదురైంది... అందం, అంతే అందమైన

Mayanti Langer : ఐపీఎల్ 13 సీజన్ రేపు మొదలు అవుతుంది అన్న క్రమంలో ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఎదురైంది... అందం, అంతే అందమైన మాటలతో ప్రేక్షకులను అలరించే యాంకర్ మాయంతి లాంగర్ ఈ ఏడాది ఐపీఎల్ లో కనిపించదట.. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి ఆమె తప్పుకున్నట్లుగా లీగ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.. ఈ ఏడాది ఐపిఎల్ కి యాంకర్లుగా వ్యవహరించే జాబితాను విడుదల చేయగా అందులో ఆమె పేరు లేదు .

అయితే ఇందులో ఆమె పేరు ఎందుకు లేదు అన్న దానిపైన స్పష్టత లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తప్పుకున్నారా లేకా స్పోర్ట్స్‌ యాజమాన్యమే ఆమెను తప్పించిందా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక ఐపీఎల్ లో ఆటగాళ్ల ఆట ఎంత ఫేమాసో గ్లామర్ కూడా అంతే ఫేమస్.. చీర్ గర్ల్స్ .. యాంకర్ల ముద్దు ముద్దు మాటలు ప్రత్యేకమైన ఆకర్షణనీయంగా నిలుస్తాయి.. అయితే ఇలాంటి మెగా ఈవెంట్ లో మాయంతిలాంటి అందమైన యాంకర్‌ లేకపోవడం ప్రేక్షకులకు కొంత నిరాశనే అని చెప్పాలి..

మాయంతి లాంగర్ విషయానికి వచ్చేసరికి.. తన డ్రెస్ లతో, తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలా టీవీ లకి కట్టిపడేస్తుంది.. స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ అయిన ఫుట్‌బాల్ కేఫ్‌తో ఆమె ప్రయాణం మొదలైంది.. ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ కప్, ఐపీఎల్ సీజన్ లలో యాంకర్ గా మెరిసింది.. ఇక స్టువర్ట్ బిన్నీని ఆమె వివాహం చేసుకున్నారు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్ కి విడుదల చేసిన యాంకర్ జాబితాలో ముందు సీజన్లలో యాంకర్‌గా వ్యవహరించిన జతిన్ సప్రూ, అనంత్ త్యాగి, సంజనా గణేశన్, సుహాలి చందోక్‌లను ఈ సారి కూడా వారినే కొనసాగించింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్ స్పోర్ట్స్ జర్నలిస్టు నెరోలీ మెడోస్‌ కూడా ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం...

Show Full Article
Print Article
Next Story
More Stories