SRH vs GT, IPL 2024: గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ వర్షార్పరణం.. ప్లే ఆఫ్స్ నకు హైదరాబాద్

SRH vs GT, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 May 2024 1:40 PM IST
Match Abandoned Due To Rain As SRH Secure Qualification For Playoffs
X

SRH vs GT, IPL 2024: గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ వర్షార్పరణం.. ప్లే ఆఫ్స్ నకు హైదరాబాద్

SRH vs GT, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇరు జట్లకు చెరోక పాయింట్‌ కేటాయించారు. దీంతో మొత్తం 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ నకు అర్హత సాధించింది.

ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్ నకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో జట్టుకు మాత్రమే గరిష్ఠంగా 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండటంతో సన్‌రైజర్స్‌ మూడో జట్టుగా ముందంజ వేసింది. గత మూడు సీజన్లలో తీవ్రంగా నిరాశపర్చిన సన్‌రైజర్స్‌.. 2020 తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story