కోహ్లీ వారసుడిగా లోకల్ కుర్రాడే.. ఆర్‌సీబీ పగ్గాలు చేపట్టేందుకు అంతా సిద్ధం..!

Manish Pandey Likely To Replace Virat Kohli As RCB Skipper | Cricket News Today
x

కోహ్లీ వారసుడిగా లోకల్ కుర్రాడే.. ఆర్‌సీబీ పగ్గాలు చేపట్టేందుకు అంతా సిద్ధం..!

Highlights

IPL 2022 Mega Auction: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మనీష్ కొత్తవాడు కాదు. గతంలో ఈ ఫ్రాంచైజీలో భాగమయ్యాడు...

IPL 2022 Mega Auction: అంతర్జాతీయ టీ20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి కూడా కెప్టెన్‌గా వ్యవహరించడంలేదు. అయితే ఇటీవల ఆర్‌సీబీ గ్లెన్ మాక్స్‌వెల్, సిరాజ్‌, కోహ్లీని రిటైన్ చేసుకుంది. వీరిలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ చాలా సీనియర్ ప్లేయర్. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీష్ పాండేను విడుదల చేయడంతో ఆయన పేరు వార్తల్లో నిలిచింది.

కొన్ని నివేదిక మేరకు మెగా వేలంలో మనీష్ పాండేను దక్కించుకోవడం కోసం ఆర్‌సీబీ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ బిడ్ వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు మనీష్‌కే కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించవచ్చని తెలుస్తోంది. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. ఆర్‌సీబీకి మనీష్ కొత్త కాదు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మనీష్ కొత్తవాడు కాదు. గతంలో ఈ ఫ్రాంచైజీలో భాగమయ్యాడు. 2009లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగి సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్‌లో ఏ భారతీయుడికైనా ఇదే తొలి సెంచరీగా నిలిచింది.

2. పనిచేయనున్న లోకల్ మంత్రం..

మనీష్ పాండే కర్ణాటక నుంచి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అలాగే ప్రస్తుతం మనీష్ పాండే చాలా ఫిట్‌గా ఉన్నాడు. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు ఆర్‌సీబీ ప్లాన్ చేస్తోంది. అలాగే లోకల్‌ సారథిగాను మనీష‌‌కు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ప్రతీ జట్టు తన 14 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లను సొంత మైదానంలోనే ఆడాల్సి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో, పిచ్, లోకల్ పరిస్థితులపై మెరుగైన అవగాహన ఉన్న మనీష్ పాండేకు పుష్కలంగా సారథిగా మారే అవకాశాలు ఉన్నాయి.

రోహిత్ శర్మకు కెప్టెన్సీని అప్పగించడం ద్వారా ముంబై ఇండియన్ చాలా కాలం క్రితమే లోకల్ ట్రెండ్‌ను ప్రారంభించింది. తాజాగా ఢిల్లీ జట్టు కూడా రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు లోకల్ బాయ్ మనీష్‌ ఆర్‌సీబీ కెప్టెన్‌గా మారనున్నాడు.

3. దాదాపు కొత్త జట్టే..

ఆర్‌సీబీ, హైదరాబాద్‌తో పాటు, మనీష్ కోల్‌కతా నైట్ రైడర్స్, పూణే వారియర్స్ ఇండియా తరపున కూడా ఆడాడు. అంటే, ప్రస్తుత కాలంలో ఆడుతున్న చాలా మంది విదేశీ, భారతీయ ఆటగాళ్లతో అతనికి ఇప్పటికే సత్సంబంధాలు ఉన్నాయి. లోకల్ బాయ్ కావడంతో కర్ణాటక ఆటగాళ్లతో కూడా అతని ట్యూనింగ్ బాగుంటుంది. మరోవైపు, మ్యాచ్ సమయంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఆడే ఛాన్స్ ఉంది. మిగిలిన ఏడుగురు భారతీయులే ఉంటారు. మెగా వేలం సమయంలో ఆర్‌సీబీ దాదాపుగా కొత్త జట్టును సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. దీంతో పాండే, మాక్స్‌వెల్ లేదా మరే ఇతర విదేశీ ఆటగాడి కంటే మెరుగైనవాడిగా నిరూపించకోగలడు.

4. కర్ణాటకకు 2 సార్లు ముస్తాక్ అలీ ట్రోఫీని అందించిన మనీష్..

పాండేకు కెప్టెన్సీ అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో కర్ణాటక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకుంది. మనీష్ కెప్టెన్సీలో కర్ణాటక జట్టు 2018-19 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర, 2019-20లో తమిళనాడును ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఏడాది కూడా ముస్తాక్ అలీ టోర్నీలో బెంగళూరు రన్నరప్‌గా నిలిచింది.

మనీష్ కెరీర్..

మనీష్ పాండే ఐపీఎల్‌లో 154 మ్యాచ్‌లు ఆడాడు. 30.68 సగటుతో 3560 పరుగులు చేశాడు. మనీష్ పేరిట 143 ఇన్నింగ్స్‌ల్లో 21 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది. గత రెండేళ్లుగా ఈ టోర్నీలో పాండే పెద్దగా రాణించడం లేదు. ఈ కారణంతోనే అనేక సందర్భాల్లో ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2018 ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ అతన్ని రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి మెగా వేలంలో ఆర్‌సీబీ, మనీష్ కోసం భారీ వేలంతో సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories