Manchester United Club: ఐపీఎల్ పై కన్నేసిన ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్

* ఐపీఎల్ జట్టు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్న ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్

Sandeep Reddy
Published on: 21 Oct 2021 5:08 PM IST
Manchester United Club Interested in Buying IPL Franchise
X

ఐపీఎల్ పై కన్నేసిన ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్

Manchester United Club: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఇప్పటి వరకూ ఉన్న 8 జట్లకు మరో రెండు జట్లను జత చేయడానికి ఇప్పటికే బిసిసిఐ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రెండు జట్ల కోసం బిడ్ దాఖలు చేయడానికి అక్టోబర్ 20 వరకూ బిసిసిఐ ఇచ్చిన గడువుని మరి కొన్నిరోజులు పెంచినట్లు తెలుస్తుంది. తాజాగా ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ఐపీఎల్ టీంని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుందని ప్రముఖ జాతీయ మీడియా వార్తని ప్రసారం చేసింది.

మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఆసక్తిగా ఉన్నందునే బిసిసిఐ కూడా ఈ బిడ్ గడువును పొడగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఐపీఎల్ జట్టును కొనుగోలు చేస్తే ఇప్పటివరకు ఉన్న క్రేజ్ మరింత పెరగడమే కాకుండా ఐపీఎల్ కి కాసుల వర్షం కురుస్తుందని భావిస్తుంది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కి యజమానులైన ఆవ్రమ్ గ్లేజర్, జోయెల్ గ్లేజర్ ఐపీఎల్ పై ఆసక్తిగా ఉన్నారని అతి త్వరలోనే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టినో రోనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story