Mumbai vs Lucknow: ఐపీఎల్ చివరి మ్యాచ్ లో లక్నో గెలుపు

Mumbai vs Lucknow: ముంబయి పై 18 పరుగుల తేడాతో లక్నోగెలుపు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 May 2024 8:03 AM IST
Lucknow won on Mumbai by 18 Run
X

Mumbai vs Lucknow: ఐపీఎల్ చివరి మ్యాచ్ లో లక్నో గెలుపు

Mumbai vs Lucknow: ఐపీఎల్ 2024 లో భాగంగా చవరి లీగ్ మ్యాచ్ లో లక్నో గెలిచింది. ముంబాయితో జరిగిన పోరులో 18 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లుు కోల్పోయి 196 పరుగులకు పరిమితం అయ్యింది. రోహిత్ శర్మ, నమన్‌దీర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, పూరన్ హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఈ ఒక్క మ్యాచ్‌తో లక్నో, ఢిల్లీ, ముంబాయి మూడు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. 14 మ్యాచ్‌లు ఆడిన లక్నో, ఢిల్లీ జట్లు ఏడు మ్యాచుల్లో విజయాలు సాధించాయి. చెన్నై 14 పాయింట్లతో మెరుగైన నెట్‌రెన్‌రేట్ కలిగి ఉంది. లక్నో, ఢిల్లీ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇప్పటికే కోల్‌కతా, రాజస్తాన్, హైదరాబాద్ టీంలు ప్లేఆఫ్స్ కు చేరుకున్నాయి. మరో స్థానం కోసం చెన్నై, బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఇవాళ చెన్నై, బెంగళూరు జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే నేరుగా ఫ్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఒక వేళ ఓడిపోతే నెట్‌రన్‌రేట్ ఏ జట్టుకు ఎక్కువ ఉంటే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story