RCB vs LSG: బెంగళూరుపై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ విజయం

RCB vs LSG: 20 ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 212 పరుగులు

Dhatripriya
Published on: 11 April 2023 7:44 AM IST
Lucknow Super Giants Won The Match
X

RCB vs LSG: బెంగళూరుపై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ విజయం

RCB vs LSG: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. 213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు సునాయసంగా విజయ తీరం చేరింది. బెంగళూరు జట్టు తరఫున కెప్టన్ డుప్లెసిస్ 79 పరుగులు, విరాట్ కోహ్లీ 61 పరుగులు, మ్యాక్స్ వెల్ 59 పరుగులు నమోదు చేశారు.

లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ మార్కస్ స్టాయినిస్ 30 బంతుల్లో 65 పరుగులు, నికోలస్ పూర్ 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడి 62 పరుగులు నమోదుచేశారు. ఆయుష్ బాదాని, జయదేవ్ ఉనద్కత్ లక్ష్యచేదనకు చేరువయ్యే క్రమంలో బాదాని హిట్ వికెట్‌గా పెవీలియన్ బాట పట్టాడు.

క్రీజులో ఉన్న జయదేవ్ ఉనద్కత్‌కు, మార్క్ వుడ్ జోడీ కట్టి ఆఖరి ఓవర్లో 5 పరుగులు కావాల్సి ఉండగా జట్టును సులభతరంగా విజయతీరం చేర్చే ప్రయత్నంలో మార్క్ వుడ్ బౌల్డయ్యారు. నాలుగు బంతుల్లో నాలుగు పరుగు చేయాల్సిన పరిస్థితిలో రవిబిష్ణోయ్ బ్యాటింగ్‌కు దిగి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Dhatripriya

Dhatripriya

Next Story