Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ అరుదైన రికార్డు

Lionel Messi wins Ballon Dor Award for Seventh Time
x

లియోనెల్ మెస్సికి అరుదైన గౌరవం (ఫైల్ ఇమేజ్)

Highlights

Lionel Messi: బాలన్‌ డి ఓర్ అవార్డు అందుకున్న లియోనల్‌ మెస్సీ

Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక బాలన్‌ డి ఓర అవార్డును ఏడుసార్లు అందుకొని చరిత్ర సృష్టించాడు. బాలన్‌ డి ఓర్‌ అవార్డు 2021కి సంబంధించి.. ప్యారిస్‌లో జరిగిన ఓ వేడుకలో ఈ అవార్డు గెలుచుకునేందుకు 30 మంది ఆటగాళ్లను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. చివరగా రాబర్ట్‌ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి మెస్సీ 'బాలన్‌ డి ఓర్‌' అవార్డు అందుకున్నాడు. మెస్సీ అంతకు ముందు 2009, 2010, 2011, 2012, 2015, 2019లలో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2020లో కరోనా కారణంగా అవార్డుల కార్యక్రమం రద్దయింది.

బాలన్‌ డి ఓర్ అవార్డును గెలుచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు మెస్సీ. గతేడాది బార్సిలోనా తరఫున 48 మ్యాచుల్లో 38 గోల్స్‌ చేశాడు. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాది జరిగిన కోపా అమెరికా కప్‌ ఫైనల్‌లో బ్రెజిల్‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తేడాతో నెగ్గింది. దీంతో 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు మెస్సీ ఓ మెగా టైటిల్‌ను అందించాడు. ఇక.. మెస్సీ ఇటీవలే బార్సిలోనా జట్టును వీడాడు. బార్సిలోనా జట్టుతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని వీడుతూ మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక స్పానిష్ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి, బార్సిలోనా కెప్టెన్‌ అలెక్సియా పుటెల్లాస్‌ మహిళ విభాగంలో ''బాలన్‌ డి ఓర్‌'' అవార్డును తొలిసారి గెలుచుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories